»Elon Musk Reacts As Ai Images Showing Him In Indian Groom Dress
Artificial Intelligenceతో ఏం మాయ.. భారతీయ వరుడిగా ఎలన్ మస్క్..
గోధుమ రంగు షేర్వాణీ, ఎర్రటి చున్నీ వేసుకుని మస్క్ అందంగా కనిపించాడు. నవ్వుతూ మస్క్ ఆనందంగా కనిపించాడు. సిడ్నీకి చెందిన ఓ ఆర్టిస్ట్ మస్క్ ను భారత సంప్రదాయ వస్త్రధారణలో కనిపించేటట్టు చేశాడు.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (Artificial Intelligence) సహాయంతో చిత్ర విచిత్రాలు చేయవచ్చు. గతంలో ప్రముఖుల చిత్రాలు మార్ఫింగ్ (Morphing) చేయగా.. తాజాగా ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ (Elon Musk)ను కూడా మార్చేశారు. అకస్మాత్తుగా ఆయన భారతదేశ సంప్రదాయ వస్త్రధారణలో (Indian Groom Dress) మెరిశారు. ఆయన భారత్ (India)కు ఎప్పుడు వచ్చాడని ఆ ఫొటో చూస్తే అందరూ అనుకుంటున్నారు. కాకపోతే అది కృత్రిమ మేధతో చేశారని తెలిసి ఓరి మీ వేషాలు అని ఊసురుమంటున్నారు.
ఆ ఫొటో చూస్తే ఏదో శుభకార్యంలో ఎలన్ మస్క్ హాజరయ్యాడని కనిపిస్తోంది. గోధుమ రంగు షేర్వాణీ (Sherwani), ఎర్రటి చున్నీ వేసుకుని మస్క్ అందంగా కనిపించాడు. నవ్వుతూ మస్క్ ఆనందంగా కనిపించాడు. సిడ్నీకి చెందిన ఓ ఆర్టిస్ట్ (Artist) మస్క్ ను భారత సంప్రదాయ వస్త్రధారణలో కనిపించేటట్టు చేశాడు. దీంతోపాటు తెల్లటి కుర్తాలో కూడా కనిపించాడు. ఈ రెండు ఫొటోలు వైరల్ గా మారాయి. ఆ రెండు ఫొటోలే కాదు మరికొన్ని ఫొటోలు ఈ వస్త్రధారణలో మస్క్ కనిపించేలా చేశారు. మరో ఫొటోలో నృత్యం (Dance) చేస్తూ.. ఇంకొక ఫొటోలో గుర్రం (Horse) ఎక్కి సందడి చేసేలా మస్క్ ను రూపొందించారు.
ఈ ఫొటోలను చూసిన ఎలన్ మస్క్ ఆశ్చర్యానికి గురయ్యాడు. భారత వస్త్రధారణలో ఇంత అందంగా ఉంటానా? అని ఆశ్చర్యపోయాడు. ‘నాకు నచ్చింది (Love)’ అని ఆ ఫొటోలను చూసి మస్క్ కామెంట్ చేశాడు. అత్యంత విలాసవంతమైన కార్ల కంపెనీ టెస్లా (Tesla), ప్రపంచంలోనే తొలి ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ (Space X) అధినేతగా కొనసాగుతున్న మస్క్ ఇటీవల ట్విటర్ (Twitter)ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ ట్విటర్ లో చాలా అనూహ్య మార్పులు చేస్తూ సంచలనం రేపుతున్నాడు.