»Mother Gives Injections To Her Daughter For Physical Growth In Vizianagaram Childline Lifed Girl
Injections కూతురిలో శారీరక ఎదుగుదల కోసం ఇంజెక్షన్లు.. కన్న తల్లి కర్కశత్వం
హీరోయిన్ అయ్యే లక్షణాలు మీ కూతురిలో ఉన్నాయని చెప్పాడు. అయితే శరీరంలో కొన్ని మార్పులు జరగాలని.. బొద్దుగా తయారుకావాలని చెప్పాడు. దీంతో ఆ తల్లిలో అనూహ్య మార్పులు వచ్చాయి. అతడి మాటలు నమ్మి శరీరంలో అవయవాల ఎదుగుదల కోసం ప్రమాదకరమైన ఇంజెక్షన్లు కుమార్తెకు ఇవ్వడం ప్రారంభించింది.
అచ్చం సినిమాల్లో (Movies) చూపించే మాదిరి సంఘటన ఏపీలో జరిగింది. తన కుమార్తె పెద్ద మనిషి కావాలని.. శారీరక ఎదుగుదల (Physical Growth) ఉండి హీరోయిన్ (Heroine)గా తయారు చేయాలనే ప్రబుద్ధితో ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. శారీరక ఎదుగుదల కోసం ప్రమాదకరమైన ఇంజెక్షన్లు (Injections) ఇచ్చింది. ఈ సంఘటన ఏపీలోని విజయనగరం జిల్లాలో (Vizianagaram District) చోటుచేసుకుంది. తల్లి అరాచకాలపై కుమార్తె చైల్డ్ లైన్ (Childline 1098)కు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాలల హక్కుల పరిరక్షణ కమిటీ (Balala Hakkula Parirakshana Committee) కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఓ మహిళ (40) నివసిస్తోంది. కుమార్తె (15) పుట్టాక మొదటి భర్త చనిపోయాడు. కొన్నాళ్లకు మరో వ్యక్తిని పెళ్లి (Marriage) చేసుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టాక రెండో భర్త ఆమెను వదిలేశాడు. ఆ ఇద్దరు పిల్లలను తన వెంట తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఆమె మరో వ్యక్తితో కలిసి సహ జీవనం చేస్తోంది. మొదటి భర్తతో పుట్టిన బాలిక విశాఖపట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో (School) పదో తరగతి పూర్తి చేసింది. వేసవి సెలవులు (Summer Holidays) కావడంతో ఇంటికి వచ్చింది. అయితే ఇంటికి చాలా మంది పురుషులు రావడంతో బాలిక ఇంట్లో ఉండేందుకు ఇష్టపడలేదు. ఇదే విషయమై తల్లితో గొడవపడుతుండేది.
ఈ క్రమంలోనే ఓ వ్యక్తి బాలికను చూశాడు. హీరోయిన్ అయ్యే లక్షణాలు మీ కూతురిలో ఉన్నాయని చెప్పాడు. అయితే శరీరంలో కొన్ని మార్పులు జరగాలని.. బొద్దుగా తయారుకావాలని చెప్పాడు. దీంతో ఆ తల్లిలో (Mother) అనూహ్య మార్పులు వచ్చాయి. అతడి మాటలు నమ్మి శరీరంలో అవయవాల ఎదుగుదల కోసం ప్రమాదకరమైన ఇంజెక్షన్లు కుమార్తెకు ఇవ్వడం ప్రారంభించింది. అతడు చెప్పిన వాటిని బాలికకు ఇస్తూ వేధించడం మొదలుపెట్టింది. ప్రతి రోజూ ఇదే జరుగుతుండడంతో బాలిక (Child Girl) తట్టుకోలేకపోయారు.
ప్రమాదకరమైన ఇంజెక్షన్ల ప్రభావంతో బాలిక తట్టుకోలేకపోయింది. అమ్మాయి అనారోగ్యానికి (Health) గురయ్యింది. తల్లి వేధింపులు తాళలేక చైల్డ్ లైన్ 1098 హెల్ప్ లైన్ (Helpline)కు ఫిర్యాదు చేసింది. వెంటనే జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. తల్లి చెర నుంచి బాలికను కాపాడారు. వెంటనే బాలికను విశాఖపట్టణంలోని స్వధార్ హోమ్ (Swadhar Greh)కు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయాలని దిశ పోలీసులకు బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ కేసలి అప్పారావు ఆదేశించారు. ప్రస్తుతం బాలికకు వైద్యం అందిస్తున్నారు. ఇలాంటి వేధింపులకు గురవుతున్న బాలాబాలికలకు తమ సంస్థ అండగా ఉంటుందని తెలిపారు.