Varun Tej పెళ్లి కోసం వంటలు నేర్చుకుంటున్నావా బ్రో? హీరో వరుణ్ తేజ్ పోస్ట్ వైరల్
‘ఇలాంటిది గతంలో ఎప్పుడూ తినలేదు’ అని పోస్టు చేశాడు. స్వయంపాకం అద్భుతంగా వచ్చిందని వరుణ్ తెలిపాడు. వంటలు నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆల్ద బెస్ట్ బ్రో.. పెళ్లయ్యాక మనమే వంటలు చేయాలి మరిందరు కామెంట్ చేస్తున్నారు.
కష్టపడి చెమటోడ్చి యువ నటుడు వరుణ్ తేజ్ (Varun Tej) పిజ్జా తయారు చేశాడు. అది ఎవరి కోసం చేశావ్ బ్రో అని నెటిజన్లు (Netizens) కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి కాకముందే వంటలు నేర్చుకుంటావా అని ప్రశ్నిస్తున్నారు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) కోసం వండుతున్నావా అని అడుగుతున్నారు. వరుణ్ పిజ్జా, పాస్తా (Pasta) తయారుచేసిన ఫొటోలు వైరల్ గా మారాయి.
వరుణ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి (Marriage) చేసుకోబోతున్నట్లు సామాజిక మాధ్యమాలు ధ్రువీకరించాయి. కానీ మెగా ఇంటి నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. వీరిద్దరి నిశ్చితార్థం జూన్ 9వ తేదీన జరుగనుందని తేల్చేశారు. అయితే ప్రస్తుతం వరుణ్, లావణ్య ఇటలీలో (Italy) తిరుగుతున్నారు. పెళ్లికి ముందే వారిద్దరూ విదేశాల్లో చక్కర్లు కొడుతున్నారు. ఈ క్రమంలోనే తాము నివసించిన చోట వరుణ్ వంట చేశాడు.
కష్టపడి.. చెమటోడ్చి పిజ్జా (Pizza), పాస్తా (Pasta) తయారు చేశాడు. వాటికి సంబంధించిన ఫొటోలను తన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఫొటోలు చూస్తుంటే పిజ్జా, పాస్తా చేసేందుకు బాబు బాగానే కష్టపడ్డట్టు కనిపిస్తోంది. అనంతరం వాటిని తిన్నాడు.. ‘ఇలాంటిది గతంలో ఎప్పుడూ తినలేదు’ అని పోస్టు చేశాడు. స్వయంపాకం అద్భుతంగా వచ్చిందని వరుణ్ తెలిపాడు. వంటలు (Cooking) నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కుకింగ్ క్లాసెస్ అని హ్యాష్ ట్యాగ్ పెట్టాడు. కాగా, ఈ ఫొటోలను చూసిన వారంతా పెళ్లి కోసం అన్ని నేర్చేసుకుంటున్నావా? అని ప్రశ్నిస్తున్నారు. ఆల్ద బెస్ట్ బ్రో.. పెళ్లయ్యాక మనమే వంటలు చేయాలి మరిందరు కామెంట్ (Comments) చేస్తున్నారు.
కాగా ఒడిశా రైలు ప్రమాదంపై (Train Accident) వరుణ్ తేజ్ స్పందించాడు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించాడు. బాధిత కుటుంబానికి కొండంత ధైర్యం, మనో నిబ్బరం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశాడు. ఈ ఘటన వార్త తెలుసుకుని తన గుండె ఆవేదనతో నిండిపోయిందని తెలిపాడు. ఈ ఘటనతో తాను కలత చెందినట్లు పేర్కొన్నాడు.