W.G: మంత్రి లోకేష్‌ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో బుధవారం మాజీ ఎమ్మెల్యేల అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పెన్షన్ సదుపాయాన్ని పెంచాలని, ఇతర అలవెన్సులు కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆచంట మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్, తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కనక సుందరం తదితరులు పాల్గొన్నారు.