HNK: జిల్లా కేంద్రంలోని KU భౌతిక శాస్త్ర విభాగ సెమినార్ హాల్లో ఈ నెల 16, 17 తేదీల్లో KU జియాలజీ విభాగం ఆధ్వర్యంలో “Recent Advances and Challenges in Geology” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యఅతిథిగా కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రతాప్ రెడ్డి హాజరై ఈ సదస్సును ప్రారంభించనున్నారు.