MBNR: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం రక్షణకై ఉద్యమిద్దామని మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. జిల్లాకేంద్రంలో జరుగుతున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాలుగవ రాష్ట్ర మహాసభల సన్నాహక సమావేశానికి సంజీవ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. BJP చేస్తున్న కుతంత్రాలను గ్రామీణ స్థాయిలో ప్రజలకు వివరించి వారిలో చైతన్యం కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.