PLD: చిలకలూరిపేటలోని సబ్ స్టేషన్లో అత్యవసర మరమ్మతుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు DEE అశోక్ కుమార్ తెలిపారు. పట్టణంలోని అన్ని ప్రాంతాలలో సరఫరా ఉండదన్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు. మెరుగైన విద్యుత్ సరఫరాకు వినియోగదారులు సహకరించాలని కోరారు.