MHBD: దంతాలపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఓ లారీ ఎదురుగా వచ్చిన RTC బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన వాహనాదారులు గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.