»Telugu Passengers Details Not Found In Odisha Train Accident
Train Accident 400 మంది తెలుగు ప్రయాణికుల ఆచూకీ గల్లంతు.. ఏపీలో ఆందోళన
రైలు ప్రమాదంలో ఏకంగా 400 మంది తెలుగు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కాగా వారి ఆచూకీ ఇంతవరకు లభించకపోవడంతో ఏపీలో ఆందోళన రేకెతుత్తోంది. వారి పరిస్థితి ఏమిటో..? క్షేమంగా ఉన్నారా లేదా లేదా అని వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ఒడిశాలో (Odisha) చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం (Train Accident) ఏపీలో భయాందోళన రేపుతున్నది. సరిహద్దు రాష్ట్రం కావడంతోపాటు భువనేశ్వర్, కలకత్తాలకు ఏపీ ప్రజలు తరచూ రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన రైలు ప్రమాదంలో ఏకంగా 400 మంది తెలుగు ప్రయాణికులు (Passengers) ఉన్నట్లు సమాచారం. కాగా వారి ఆచూకీ ఇంతవరకు లభించకపోవడంతో ఏపీలో ఆందోళన రేకెతుత్తోంది. వారి పరిస్థితి ఏమిటో..? క్షేమంగా ఉన్నారా లేదా లేదా అని వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా రాష్ట్ర ప్రజల విషయమై సీఎం జగన్ (Jagan) రైల్వే అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు. దీనిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
షాలిమార్ (Shalimar) నుంచి చెన్నై (Chennai) వెళ్తున్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ (Coromandel Express), యశ్వంత్ పూర్ నుంచి హావ్ డా వెళ్తున్న ఈ రెండు రైళ్లల్లో తెలుగు ప్రయాణికులు ఉన్నారు. రైల్వే అధికారుల సమాచారం ప్రకారం 400 మందికి పైగా తెలుగు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో షాలిమార్, ఖరగ్ పూర్, సంత్రగచ్చి, బాలేశ్వర్ స్టేషన్ లలో ఎక్కిన ప్రయాణికుల్లో 47 మంది విజయవాడ, రాజమహేంద్రవరంలో 22 మంది, ఏలూరులో ఒకరు చొప్పున మొత్తం 70 మంది దిగాల్సి ఉంది. ఇదే రైలులో రాజమహేంద్రవరం నుంచి 56 మంది, తాడేపల్లిగూడెంలో 10మంది, ఏలూరులో 44 మంది, విజయవాడలో 120 మంది ప్రయాణికులు ఎక్కారు. వారంతా చెన్నైలో దిగడానికి రిజర్వేషన్ (Reservation) చేసుకున్నారు.
యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ రైలు విషయంలో ప్రయాణికుల సంఖ్య తెలియలేదు. కానీ కోరమండల్ రైలు కన్నా అధికంగా తెలుగు ప్రయాణికులు (Telugu Passengers) ఎక్కారని సమాచారం. తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, సామర్లకోట, విశాఖపట్టణం, విజయవనగరం, శ్రీకాకుళం, పలాస్ స్టేషన్ల మీదుగా ఈ రైలు వెళ్లింది. యశ్వంత్ పూర్, తిరుపతి, రేణిగుంట స్టేషన్ లో అధిక సంఖ్యలో ప్రయాణికులు ఎక్కారు. తిరుపతి, రేణిగుంట, చీరాల స్టేషన్ల నుంచి ఖరగ్ పూర్, హావ్ డా వైపు 52 మంది ప్రయాణికులు వెళ్లినట్లు రైల్వే నివేదికలో తేలింది.
ఇలా లెక్కలు తీయగా 400 మందికి పైగా ఇరు రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారు. ప్రమాదం సమయంలో వారి ఆచూకీ (Not Found) లభించలేదు. వారి పరిస్థితి ఏమిటోనని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. వీరి ఆచూకీ కోసం రైల్వే శాఖ, ఏపీ ప్రభుత్వం (Govt of AP) సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసింది. హెల్ప్ లైన్ (Helpline) నంబర్లు ఏర్పాటు చేశారు.
హైల్ప్ లైన్ నంబర్లు ఇవే..
విశాఖపట్టణంలో 08912 746330, 08912 744619
విజయనగరం 08922 221202, 08922 221206
శ్రీకాకుళం 08942 286213, 08942 286245
విజయవాడ 0866 2576924
రాజమహేంద్రవరం 0883 2420541