»Kotha Telangana Charitra Brindam Found 2000 Years Back Iron Production Factory In Wanaparthy District
Chittem సరికొత్త చరిత్ర.. తెలంగాణలో 2 వేల నాటి ఇనుము ఉత్పత్తి క్షేత్రం వెలుగులోకి
ఈ మట్టిలో ఎంతో విలువైన సంపద దాగి ఉంది. తవ్వి తీస్తే ప్రతి అడుగులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆదిమ కాలం నుంచి ఈ నేలపై జీవనం సాగుతోంది. అందుకే తెలంగాణ చరిత్ర ఎంతో పెద్దది.
తెలంగాణకు (Telangana) ఎంతో ఘన చరిత్ర ఉంది. ఈ మట్టిలో ఎంతో విలువైన సంపద దాగి ఉంది. తవ్వి తీస్తే ప్రతి అడుగులో ఏదో ఒక ప్రత్యేకత (Speciality) ఉంటుంది. ఆదిమ కాలం నుంచి ఈ నేలపై జీవనం సాగుతోంది. అందుకే తెలంగాణ చరిత్ర ఎంతో పెద్దది. తాజాగా సరికొత్త చరిత్ర (History) వెలుగులోకి వచ్చింది. ఈ భూమిలో శతాబ్దాల కిందటే ఇనుము ఉత్పత్తి క్షేత్రం (Iron Production Factory) ఉందనే విషయం బయటపడింది. ఇనుము ఉత్పత్తి కేంద్రంగా తెలంగాణ విలసిల్లిందని తెలుస్తోంది. ఈ ఇనుము ఉత్పత్తి క్షేత్రం ఉమ్మడి పాలమూరు జిల్లాలో (MahabubNagar Area) చరిత్ర అధ్యయనం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.
వనపర్తి జిల్లా (Wanaparthy District) చిట్యాల (Chityala) గ్రామంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం (Kotha Telangana Charitra Brindam) పర్యటించింది. మూలోనిగుట్ట సమీపంలోని తగళ్లగడ్డలో ఓ పొలాన్ని పరిశీలించగా ఇనుము ఆనవాళ్లు లభించాయి. 14 ఎకరాల వ్యవసాయ భూమిలో ఇనుము ఉత్పత్తి క్షేత్రం ఉందని కొత్త చరిత్ర బృందం గుర్తించింది. ఆ భూమిలో చిట్టెం కుప్పలు.. కుప్పలుగా కనిపించింది. చిట్టెం (Chittem) అంటే ఇనుము ఉత్పత్తి చేసిన తర్వాత మిగిలే వ్యర్థం. అలాంటి వ్యర్థం రాశులుగా ఈ భూమిలో కనిపించింది.
ఈ సందర్భంగా కొత్త చరిత్ర బృందం సభ్యులు బైరోజు చంద్రశేఖర్, డాక్టర్ శ్యాంసుందర్ మాట్లాడుతూ.. ‘ఈ నేలను వ్యవసాయ భూమిగా మార్చే సమయంలో 20 అడుగుల చుట్టూ కొలత గల ఇటుకల (Bricks) కట్టడం, ఇనుము కరిగించడానికి వాడే మూసలు, పెద్ద పెద్ద గొట్టాలు, పెద్ద పెద్ద మట్టిసట్టి, గాగుల వంటి పెంకులు దొరికాయని గ్రామస్తులు మాకు చెబుతున్నారు. 16 అంగుళాల పొడవు, 8 అడుగుల వెడల్పు, 6 అంగుళాల మందంతో ఉన్న ఇటుకలు ఇక్కడ కనిపిస్తున్నాయి. పొలంలో లభించిన చిట్టెం ముద్దలను పొలం గట్లకు హద్దుగా (Border) మార్చుకున్నారు’ అని తెలిపారు.
ఇక్కడి సమీప పొలాల్లో కూడా మట్టి తవ్వితే ముడి ఇనుప ఖనిజం (Raw Iron) ముద్దలు ముద్దలుగా రాళ్ల రూపంలో లభిస్తోంది. ఇక్కడి పరిసరాల పేర్లు గమనిస్తే పెద్ద మందడి, చిన్న మందడి, అమ్మాయిపల్లి అనేవి తెలుసుకున్నాం. మందడి అంటే అశ్వశాల (Horse). అశ్వస్యైన్య స్థావరంగా మందడి గ్రామాల ప్రస్తావన చోళుల కాలంలోని శాసనంలో పేర్కొనబడింది. ఇక అమ్మ అంటే తల్లి, అయి, ఆయో అంటే ఇనుము ఉత్పత్తికి కారణభూతమైన తల్లిగా, లోహకారక దేవతగా పూజించబడే ‘మమ్మాయి’ దేవత నిలయమైన గ్రామం అమ్మాయిపల్లి. దీనికి బలాన్నిచ్చేలా గణపురం కమ్మరి గేరి శివాలయంలో మొమ్మాయిగా అమ్మవారు పూజింపబడుతున్నారు. లభించిన ఆధారాలను బట్టి రెండు వేల సంవత్సరాలకు పూర్వమే చిట్యాల ముడి ఇనుము, ఖనిజ నిక్షేపాలు, ఇనుము ఖనిజ ఉత్పత్తి కేంద్రంగా ఉండేదని తెలుస్తోంది.’ అని కొత్త చరిత్ర బృందం సభ్యులు వివరించారు.
అంతదాకా ఎందుకు మక్తల్ (Makthal) ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇంటి పేరు చిట్టెం. ఈ ఇనుము క్షేత్రం ద్వారా చిట్టెం అనే పేరుతో సరికొత్త చరిత్ర ఉంది. గతంలో ఈ ఇనుము క్షేత్రంలో పని చేసేవారిని చిట్టెంవాసులుగా కూడా పిలవబడ్డారని సమాచారం’ అని పరిశోధకుడు డాక్టర్ శ్యాంసుందర్ తెలిపారు.