అప్రతిహతంగా తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) కొనసాగుతోంది. నిరంతరాయంగా ప్రజల ఆదరాభిమానంతో లోకేశ్ ఉత్సాహంగా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ పాదయాత్రకు వైసీపీ (YCP) అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. అధికార దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వం, పోలీసులు యంత్రాంగం లోకేశ్ యాత్రపై ఆంక్షలు (Restrictions) కొనసాగుతున్నాయి. తాజాగా పాదయాత్రలో భద్రతా వైఫల్యం లోపించింది. లోకేశ్ పాదయాత్రపైకి కోడిగుడ్ల దాడి జరిగింది. ఈ ఘటనపై లోకేశ్ తో పాటు టీడీపీ (TDP) శ్రేణులు భగ్గుమన్నారు. దాడికి పాల్పడిన యువకుడిని చితకబాదారు. ఈ సంఘటన సీఎం జగన్ సొంత జిల్లా కడపలో (Kadapa District) చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
యువగళం పాదయాత్ర 113వరోజు గురువారం ప్రొద్దుటూరు (Proddatur) శివారు చౌటపల్లి నుంచి ప్రారంభమైంది. మహిళలు, వృద్దులు, వివిధ సామాజికవర్గాల వారు లోకేశ్ ను కలిసి వారి సమస్యలు విన్నవించుకున్నారు. రాత్రి పాదయాత్ర కొనసాగుతుండగా ఇద్దరు యువకులు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. లోకేశ్ లక్ష్యంగా దాడి చేసుకుని త్రుటిలో తప్పి భద్రతా సిబ్బందిపై పడింది. ఈ ఘటనపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు (Karyakartas) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ దుండగుడిని అదుపులోకి తీసుకుని తీవ్రంగా కొట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా పోలీసుల (Police) తీరుపై నారా లోకేశ్ మండిపడ్డారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. దాడికి పాల్పడింది వైసీపీ నాయకుడే అయి ఉంటాడని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అందుకనే అతడి వివరాలు (Details) బయటకు రాలేదు. దాడికి పాల్పడిన వ్యక్తిని కాపాడుతున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
ఈ దాడిపై ట్విటర్ (Twitter) వేదికగా లోకేశ్ స్పందించారు. ‘రాష్ట్రంలోనే కాదు సొంత జిల్లాలోనూ జగన్ (Jagan) జంగిల్ రాజ్ నడుస్తోంది. ప్రొద్దుటూరులో ప్రశాంతంగా సాగుతున్న పాదయాత్రలో అలజడి సృష్టించాలని వైసీపీ కార్యకర్తలు దాడులకి బరితెగించారు. పోలీసుల వైఫల్యం వల్లే నా భద్రతా సిబ్బందిపై వైసీపీ వాళ్లు దాడి చేయగలిగారు. ఎన్ని కవ్వింపులకి పాల్పడినా, నా పాదయాత్ర ఆగదు. పోలీసుల సాయంతో ఎన్ని దాడులు చేసినా అవినీతి పాలకులని ప్రశ్నించడం ఆపను.’ అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.