»Janasena Party Chief Pawan Kalyan Greets To People For Telangana Formantion Day
Telangana Formation Day పేదరికం లేని తెలంగాణ ఆవిష్కృతం కావాలి: పవన్ కల్యాణ్
నాటి బీడు భూములు నేడు మాగాణాలయ్యాయి.. బోసిపోయిన పల్లెలు మళ్లీ కళకళలాడుతున్నాయి. స్వరాష్ట్రంగా ఏర్పడి పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా పండుగ వాతావరణం సంతరించుకుంది.
దగా పడిన రోజుల నుంచి దర్జాగా బతికే రోజులు వచ్చాయి. నాటి బీడు భూములు నేడు మాగాణాలయ్యాయి.. బోసిపోయిన పల్లెలు (Villages) మళ్లీ కళకళలాడుతున్నాయి. స్వరాష్ట్రంగా ఏర్పడి పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా పండుగ (Festival) వాతావరణం సంతరించుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ (Telangana) ప్రజలకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు (Wishes) చెబుతున్నారు. జనసేన పార్టీ (JanaSena Party) అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శుభాకాంక్షలు తెలిపారు.
‘4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు, వేలాది మంది ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం. అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని, అభివృద్ధి పథంలో దూసుకెళ్ళాలని జనసేనపార్టీ తరపున ఆకాంక్షిస్తూ, తెలంగాణ అమరవీరులకు (Martyrs) నివాళులు అర్పిస్తున్నాం’ అని జనసేన పార్టీ పేర్కొంది.
‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల (Telangana Decennial Celebrations) సందర్భంగా తెలంగాణవాసులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. నేటి నుంచి 22వ తేదీ వరకు సాగే ఈ దశాబ్ది ఉత్సవాలు చరిత్రాత్మకమైనవి. ఎందరో పోరాటయోధుల ప్రాణ త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. అటువంటి త్యాగధనులందరికీ నివాళులు అర్పిస్తున్నా. పేదరికం లేని తెలంగాణ ఆవిష్కృతం కావాలని, రైతులు (Farmers), కర్షకులు, కార్మికులతో పాటు ఈ నేలపై జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఆనందకరమైన జీవితం సాగించాలని కాంక్షిస్తూ.. తెలంగాణ ఖ్యాతి, కీర్తి అజరామరంగా భాసిల్లాలని కోరుకుంటున్నా. జై తెలంగాణ’ – పవన్ కల్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు