NLG: మిర్యాలగూడలోని శ్రీ వాగ్దేవి హైస్కూల్లో ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా వేధింపులపై షీ టీం ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సు జరిగింది. సీఐ కరుణాకర్, ఎస్సై వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు,విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, అత్యవసర పరిస్థితుల్లో 100కు కాల్ చేయడం,ఆన్లైన్ మోసాలు,డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు.