»Indian Origin Teen Dev Shah Crowned Us National Spelling Bee Champion
Spell Bee పోటీల్లో సంచలనం.. విజేతగా భారత సంతతి విద్యార్థి 14 ఏళ్ల దేవ్ షా
విజేతగా నిలిచిన అనంతరం దేవ్ షా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ట్రోఫీ అందుకున్న అనంతరం మాట్లాడుతూ.. ‘ఇది నమ్మలేకపోతున్నా. ఇప్పటికీ నా కాళ్లు వణుకుతున్నాయి’ దేవ్ షా తెలిపాడు.జ
అమెరికాలో నిర్వహించే స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతికి చెందిన వారు సత్తా చాటుతున్నారు. తాజాగా ఈ ఏడాది కూడా భారత సంతతికి చెందిన విద్యార్థి విజేతగా నిలిచాడు. 95వ నేషనల్ స్పెల్లింగ్ బీ (Scripps National Spelling Bee) విజేతగా 14 ఏళ్ల దేవ్ షా (Dev Shah) నిలిచాడు. ముచ్చటగా మూడోసారి పోటీపడి తుదికి గెలుపొందాడు. ఈ విజయంపై ఆ విద్యార్థి ఉబ్బితబ్బిబయ్యాడు. అసలు నమ్మలేకపోతున్నా అని పేర్కొన్నాడు.
భారత్ (India)కు చెందిన దేవల్ (Deval) కుటుంబం 29 ఏళ్ల కిందట అమెరికాకు వలస వెళ్లింది. ఫ్లోరిడా (Florida) రాష్ట్రంలోని లార్గోలో (Largo) స్థిరపడ్డారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన దేవల్ కుమారుడు దేవ్ షా రెండు సార్లు స్పెల్ బీ పోటీల్లో పాల్గొన్నాడు. ముచ్చటగా మూడోసారి పోటీ పడి విజేతగా నిలిచాడు. శామాఫైల్ (Psammophile) అనే పదానికి స్పెల్లింగ్ చెప్పి 50 వేల డాలర్ల నగదు బహుమతి సొంతం చేసుకున్నాడు. విజేతగా నిలిచిన అనంతరం దేవ్ షా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ట్రోఫీ అందుకున్న అనంతరం మాట్లాడుతూ.. ‘ఇది నమ్మలేకపోతున్నా. ఇప్పటికీ నా కాళ్లు వణుకుతున్నాయి’ దేవ్ షా తెలిపాడు. మోర్గాన్ ఫిట్జ్ గెరాల్డ్ మిడిల్ స్కూల్ లో దేవ్ షా చదువుతున్నాడు.
ఇంతకీ శామఫైల్ అంటే ఏమిటో తెలుసా? ఇసుక నేలల్లో కనిపించే జీవి లేదా మొక్క అని అర్థం. కుమారుడి విజయంపై తల్లి గర్వంగా ఉందని పేర్కొన్నారు. తన బిడ్డ విజయంపై తండ్రి దేవల్ మాట్లాడుతూ.. ‘మూడేళ్ల వయసు నుంచే దేవ్ షా స్పెల్లింగ్ (Spelling) గుర్తు పెట్టుకుని చెప్పడం మొదలుపెట్టాడు. ది నార్త్ సౌత్ ఫౌండేషన్ (The North South Foundation) నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నాడు. ఈ సంస్థ భారత్ లో పిల్లలకు ఉపకార వేతనాలు (Schlorships) అందిస్తుంది. దేవ్ షా రెండుసార్లు స్పెల్ బీ పోటీల్లో పాల్గొన్నాడు. 2019లో 51వ స్థానం.. 2021లో 76వ స్థానంలో నిలిచాడు. ఈసారి మాత్రం విజేతగా నిలిచి తన కలను నెరవేర్చుకున్నాడు’ అని తెలిపాడు.
1924లో నేషనల్ స్పెల్ బీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో 8వ తరగతిలోపు విద్యార్థులు పాల్గొనవచ్చు. పోటీల్లో కఠినమైన ఆంగ్ల పదాల అక్షర క్రమాన్ని (స్పెల్లింగ్) చెప్పాలి. అలా రౌండ్ల (Rounds) వారిగా చెబుతూ తుది వరకు సరైన సమాధానం చెప్పేవాళ్లు విజేతలుగా నిలుస్తారు. తాజాగా జరిగిన పోటీల్లో రన్నరప్ గా వర్జీనియాలోని ఆర్లింగ్టన్ కు చెందిన 14 ఏళ్ల బాలిక చార్లెట్ వాల్ష్ నిలిచింది. ప్రతిష్టాత్మక ఈ పోటీల్లో మొత్తం 231 మంది విద్యార్థులు పోటీ పడగా.. 11 మంది మాత్రమే ఫైనల్స్ కు చేరుకున్నారు.
Congratulations to this year’s 2023 ??????? ???????? ???????? ??? ????????, Dev Shah! ? pic.twitter.com/xQFIdg9JLY
UnBEElievable! #Speller36 Dev Shah representing the SNSB Region One Bee in Largo, Florida is the Champion of the 95th Scripps National Spelling Bee. His winning word? Psammophile. ? #spellingbeepic.twitter.com/ebM8jUU6xZ
— Scripps National Spelling Bee (@ScrippsBee) June 2, 2023