»Tragedy Mahabubnagar Student Dies In Road Accident In Us
USలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం.. కొన ఊపిరితో మరో ముగ్గురు
సమాచారం తెలుసుకున్న ఆయా కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక మహేశ్ కుటుంబం దిగ్భ్రాంతికి గురయ్యింది. చేతికొచ్చిన పెద్ద కుమారుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
అమెరికాలో (USA) ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు (Telangana) చెందిన విద్యార్థి దుర్మరణం పాలవగా.. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలై కొన ఊపిరితో ఉన్నారు. ఈ సంఘటనతో తెలంగాణలోని మహహబూబ్ నగర్ జిల్లాలో (Mahabubnagar District) తీవ్ర విషాదం అలుముకుంది. స్నేహితుడి పుట్టిన రోజుకు (Birth Day) వెళ్లి ఆనందంగా గడిపివచ్చిన స్నేహితులు అంతలోనే ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ (Bhuthpur) మండలం కప్పెట గ్రామానికి చెందిన బోయ శంకుతల, వెంకట్ రాముల కుమారుడు బోయ మహేశ్ (24) (Boya Mahesh). బీటెక్ పూర్తి చేసిన మహేశ్ నాలుగు నెలల కిందట ఉన్నత విద్య (Higher Education) కోసం అమెరికా వెళ్లాడు. మెన్నెసోట రాష్ట్రం (Minnesota) మినియాపోలీస్ సిటీలో (Minneapolis) ఉంటూ చికాగో (Chicago) నగరంలోని కాంకోర్డియా యూనివర్సిటీలో (Concordia University) ఎంఎస్ చదువుతున్నాడు. మంగళవారం మహేశ్ తన స్నేహితులు శివ, బరత్, శ్రీలక్ష్మితో కలిసి లాంగ్ డ్రైవ్ కు వెళ్లారు. ఈ సమయంలో వారి కారు ఎదురుగా ఓ జంతువు వచ్చింది. అకస్మాత్తుగా రావడంతో డ్రైవర్ గందరగోళానికి గురవడంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. శివ, శ్రీలక్ష్మి, భరత్ తీవ్రంగా గాయపడ్డారు.
కాగా వీరు స్నేహితుడు పుట్టిన రోజు కోసం లాంగ్ డ్రైవ్ (Long Drive) వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ వేడుకలు పూర్తి చేసుకున్న అనంతరం తిరుగు ప్రయాణంలో ఈ సంఘటన జరిగిందని సమాచారం. ప్రమాదం ధాటికి రోడ్డు ధ్వంసం కాగా.. కారు నుజ్జునుజ్జయ్యింది. సమాచారం తెలుసుకున్న ఆయా కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక మహేశ్ కుటుంబం దిగ్భ్రాంతికి గురయ్యింది. చేతికొచ్చిన పెద్ద కుమారుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు (Parents) బోరున విలపిస్తున్నారు. మృతదేహం తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) కూడా సహాయ చర్యలు చేపడుతోంది. రెండు, మూడు రోజుల్లో స్వస్థలానికి మహేశ్ మృతదేహం వచ్చే అవకాశం ఉంది. కాగా, మహేశ్ తండ్రి వెంకట్ రాములు మహారాష్ట్రలో ఓ కాంట్రాక్టర్ వద్ద సూపర్ వైజర్ గా పని చేస్తున్నారు.