»Guppedantha Manusu Serial Hero Mukesh Gowda Father Demised
Guppedantha Manusu హీరో ముఖేష్ ఇంట్లో విషాదం.. షూటింగ్ ఆపేసి వెళ్లిన నటుడు
పక్షవాతంతో బాధపడుతున్న అతడి తండ్రి కన్నుమూశాడు. ముఖేశ్ కు తల్లిదండ్రులతోపాటు ఒక సోదరి ఉంది. ఇప్పుడు తండ్రి మరణంతో అతడు కుటుంబానికి పెద్ద దిక్కుగా మారాడు.
సీరియల్స్ (Serials)తో పాటు బుల్లి తెరపై అడపాదడపా టీవీ కార్యక్రమాల్లో (TV Programmes) పాల్గొంటూ సందడి చేస్తున్న నటుడు ముఖేశ్ గౌడ (Mukesh Gowda) కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. అందరినీ నవ్విస్తూ.. కవ్విస్తూ మెప్పించే పక్కింటి కుర్రాడులా ఉండే ఈ హీరో ఇప్పుడు తీవ్ర దు:ఖంలో మునిగాడు. ఆయన తండ్రి కన్నుమూశాడు. ఈ వార్త తెలియగానే షూటింగ్ లో ఉన్న ముఖేశ్ హుటాహుటిన స్వగ్రామం వెళ్లిపోయాడు.
కర్ణాటకకు (Karnataka) చెందిన ముఖేశ్ గౌడ్ కన్నడ టీవీ పరిశ్రమలో పేరుపొందాడు. మొదట మోడల్ (Model)గా రాణించిన ముఖేశ్ 2015లో మిస్టర్ కర్ణాటక టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. అనంతరం టీవీ పరిశ్రమలో (TV Industry) అడుగుపెట్టి ‘నాగకన్నిక’ అనే సీరియల్ లో తొలిసారి హీరోగా కనిపించాడు. అక్కడ సీరియల్స్ చేస్తున్న సమయంలోనే తెలుగులో ‘ప్రేమ్ నగర్’ సీరియల్ అవకాశం వచ్చింది. ఇక అక్కడి నుంచి ముఖేశ్ వరుస సీరియల్స్ చేస్తున్నాడు. ‘గుప్పెడంత మనసు’ (Guppedantha Manusu) సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తరచూ టీవీ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు.
అలాంటి హీరో ముఖేశ్ ఇప్పుడు తీవ్ర విషాదంలో మునిగాడు. పక్షవాతంతో బాధపడుతున్న అతడి తండ్రి (Father) సోమవారం కన్నుమూశాడు. ముఖేశ్ కు తల్లిదండ్రులతోపాటు ఒక సోదరి ఉంది. ఇప్పుడు తండ్రి మరణంతో అతడు కుటుంబానికి పెద్ద దిక్కుగా మారాడు. షూటింగ్ సమయంలో ఈ విషయం తెలియడంతో అక్కడి నుంచి వెంటనే హుటాహుటిన ఇంటికి వెళ్లిపోయాడు.