»Beggar Donates Rs 10 K To Cm Relief Fund In Tamil Nadu
Poolpandy అడుకున్న డబ్బులు CMకు పంపిన బిచ్చగాడు.. అతడి చొరవకు కలెక్టర్ అభినందన
ఒంటరిగా జీవించడం ప్రారంభమైంది. పిల్లలు పట్టించుకోకపోవడంతో భిక్షగాడిగా మారాడు. కొన్నేళ్లుగా బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ప్రజలు ఇచ్చే డబ్బును పూల్ పాండీ తిరిగి వారి కోసమే వినియోగిస్తున్నాడు.
తమిళనాడులో (Tamil Nadu) ఆదర్శ బిచ్చగాడు (Beggar) ఉన్నాడు. ప్రజల నుంచి బిచ్చమెత్తుకున్న అతడు మళ్లీ ప్రజల కోసం ఖర్చు చేస్తున్నాడు. ప్రజా సేవా కార్యక్రమాలకు తన భిక్షాన్ని విరాళంగా అందిస్తున్నాడు. తాజాగా కల్తీ కల్తీ సారా తాగి 22 మంది మృతి చెందగా వారికోసం కొంత డబ్బు అందించి మరోసారి గొప్ప మనసు (Big Heart) చాటుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా (Thoothukudi District) సాత్తాకుళం సమీపంలోని ఆంగినగర్ గ్రామానికి చెందిన యాచకుడు పూల్ పాండీ (75) (Poolpandy). అతడి భార్య గతంలోనే మృతి చెందింది. పిల్లలు ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దీంతో ఒంటరిగా జీవించడం ప్రారంభమైంది. పిల్లలు పట్టించుకోకపోవడంతో భిక్షగాడిగా మారాడు. కొన్నేళ్లుగా బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ప్రజలు ఇచ్చే డబ్బును పూల్ పాండీ తిరిగి వారి కోసమే వినియోగిస్తున్నాడు. భిక్షాటనతో (Begging) వచ్చే డబ్బుతో విద్య, వైద్యం, అనాథాశ్రమాలకు అందిస్తున్నాడు. ఇలా పదేళ్లల్లో పాండిచ్చేరి, చెన్నై, తూత్తుకుడి, కన్యాకుమారి, విల్లుపురం, వేలూరు, సేలం, నీలగిరి, కోయంబత్తూరు తదితర జిల్లాల్లో ఆయా కలెక్టర్లను కలిసి తాను సంపాదించిన డబ్బును (Cash) విరాళంగా ఇచ్చారు. ఇప్పటి వరకు దాదాపు 5.60 లక్షలు సహాయం చేశారు.
తాజాగా విల్లుపురం చెంగల్పట్టులో కల్తీ సారాతో పెద్ద ఎత్తున మరణాలు సంభవించింది. వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ పూల్ పాండీ తాను యాచించగా వచ్చిన రూ.10 వేలను ప్రభుత్వానికి విరాళంగా అందించారు. తిరువళ్లూరు జిల్లా (Thiruvallur District) కలెక్టర్ అల్బీజాన్ వర్గీశ్ ను కలిసి దానికి సంబంధించిన నగదును అందించారు. గొప్ప మనసు చాటుకుంటున్న పూల్ పాండీని కలెక్టర్ (Collector) అభినందించారు.