»16 Parties Announces Boycott Of The New Parliament Buildings Inauguration Ceremony
Central Vista 19 పార్టీలు సంచలన నిర్ణయం.. మేం రానే రామని కుండబద్దలు
రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం తీవ్ర వివాదం రేపుతోంది. రాష్ట్రపతి ఆ భవనాన్ని ప్రారంభించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రపతి లేని ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని 19 ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి నిర్ణయం తీసుకున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో (New Delhi) సెంట్రల్ విస్టా (Central Vista) పేరుతో పరిపాలనా కార్యాలయన్నింటిని ఒకచోట నిర్మిస్తున్నారు. ఈ భవన సముదాయంలో పార్లమెంట్ భవనం (Parliament) సిద్ధమైంది. ఈ భవనం ప్రారంభోత్సవం తీవ్ర వివాదాస్పదమవుతోంది. దేశ ప్రథమ పౌరురాలు.. పార్లమెంట్ కు అధిపతి అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును (Draupadi Murmu) ఆహ్వానించకపోవడమే కారణం. రాష్ట్రపతి (President of India) ప్రారంభించాల్సిన కార్యక్రమాన్ని ప్రధాని చేతులమీదుగా చేయడం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశంలోని 19 పార్టీలు ఈ భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాయి.
ఈనెల 28వ తేదీన ప్రధాని కొత్త పార్లమెంట్ భవనాన్ని (Parliament o India ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాజ్యాంగ అధిపతిగా (Constitution Head) ఉన్న రాష్ట్రపతిని పిలవలేదు. దీనిపై తీవ్ర రగడ మొదలైంది. ప్రధాని మోదీ నియంతల వ్యవహరిస్తున్నాడని.. రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం తీవ్ర వివాదం రేపుతోంది. రాష్ట్రపతి ఆ భవనాన్ని ప్రారంభించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రపతి లేని ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని 19 ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి నిర్ణయం తీసుకున్నాయి.
కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం), ఆర్జేడీ, జేడీయూ, తృణమూల్, ఆప్, డీఎంకే, ఎన్సీపీ, శివసేన (ఉద్దవ్ వర్గం) తదితర పార్టీలు పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాలని నిర్ణయించాయి. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) మాత్రం దీనిపై ఎలాంటి చర్చ జరగడం లేదు. అయితే కేంద్రంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ (BRS Party) మరి ప్రారంభోత్సవానికి వెళ్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రపతి రావాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలోనే పై నిర్ణయం తీసుకున్నారు. ఇక ఏపీలో జగన్ (Jagan) బీజేపీతో రహాస్య స్నేహం నడిపిస్తుండడంతో పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి ఆ పార్టీ హాజరయ్యే అవకాశం ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ (TDP) మాత్రం హాజరు కావాలని నిర్ణయించింది.
16 పార్టీలు ఇవే..
కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం), ఆర్జేడీ, జేడీయూ, తృణమూల్, ఆప్, డీఎంకే, ఎన్సీపీ, శివసేన (ఉద్దవ్ వర్గం), సమాజ్ వాదీ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా కేరళ కాంగ్రెస్ (మణి), విడుతలై చిరుతైగల్ కట్చి, రాష్ట్రీయ లక్ దళ్, ఇండియన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (ఎన్సీపీ), రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ, ఏఐఏడీఎంకే.