»Minister Sridhar Babu Said That The Opposition Parties Should Not Hurry On The Six Guarantees
Minister Sridhar Babu: ఆరు గ్యారెంటీలపై ప్రతిపక్షాలకు తొందరపాటు వద్దు
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలపై ప్రతిపక్షాలు తొందపడొద్దని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా పూర్తి అవలేదని, కచ్చితంగా వాటిని అమలు చేసే దిశలోనే పార్టీ కార్యాచరణ మొదలు పెట్టిందని వ్యాఖ్యానించారు.
Minister Sridhar Babu said that the opposition parties should not hurry on the six guarantees
Minister Sridhar Babu: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల హామితో అధికారంలోకి వచ్చిందని, వాటిని అమలు చేసే దిశగా పార్టీ అడుగులు వేస్తుందని మంత్రి, టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు వెల్లడించారు. గాంధీ భవన్లో మంగళవారం మేనిఫెస్టో కమిటీ సమావేశం అయింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుపరిచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన రెండో రోజునే మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకం, ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేశారు.
పథకాల అమలుపై ప్రతిపక్షాలు కక్షపూరితంగా మాట్లాడుతున్నారని, ఓటమిని ఇంకా జీర్ణంచులేకనే విమర్షలు గుప్పిస్తున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కచ్చితంగా హామీలను నెరవేరుస్తామని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఎంతో నమ్మకంతో ఓటు వేశారు.. ప్రజల విశ్వాసాన్ని కచ్చితంగా కాపాడుకుంటామని అన్నారు. ఓపిక లేకుండా ఇతర పార్టీలు విమర్షలు చేస్తున్నారు, మీ మాటలను ప్రజలు నమ్మడం లేదని అన్నారు.