»Telangana First Government Engineering College In Cm Revanth Constituency
Telangana: సీఎం రేవంత్ నియోజకవర్గంలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల
తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాడనున్నది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోని కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఇంజినీరింగ్ కళాశాలగా మార్చనున్నారు.
Telangana: సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోని కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ ఇంజినీరింగ్ కళాశాలగా మారుతుంది. రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఇది. దీనిని అప్‌గ్రెడేషన్ చేస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్వర్వులు జారీ చేశారు. వచ్చే విద్యాసంవత్సరం (2024-2025) నుంచి ఇక్కడ ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభించనున్నారు. అయితే ఈ కాలేజీలో 180 సీట్లుతో మూడు బీటెక్ బ్రాంచీలు అందుబాటులోకి రానున్నాయి. బీటెక్ సీఎస్ఈ, సీఎస్ఈ (ఏఐ అండ్ ఎంఎల్), సీఎస్ఈ (డేటా సైన్స్) కోర్సులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో అన్ని కళాశాలలు విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో నడుస్తాయి. కోస్గి ఇంజినీరింగ్ కళాశాల మాత్రం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మౌలిక వసతుల కల్పన, బోధన, బోధనేతర సిబ్బంది నియామకం, వేతనాలు వాటిని ఆ శాఖే చేపడుతుంది. అయితే పరీక్షల నిర్వహణ, ధ్రువపత్రాల జారీ వర్సిటీ మేరకు పనిచేయాలి. కోస్గి జేఎన్టీయూహెచ్కు అనుబంధంగా ఉండనుంది.