»Ayodhya Ram Mandhir Special Trains From Telugu States To Visit Lord Ram
Ayodhya Ram Mandhir: బాలరాముడిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
అయోధ్య రామమందిరంలో బాలరాముడు కొలువు దీరాడు. ఈరోజు నుంచి భక్తులకు బాలరాముడు దర్శనమివ్వనున్నాడు. ఈక్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు వెళ్లడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. రామభక్తులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది.
Ayodhya Ram Mandhir: కోట్లాది ప్రజల కల నెరవేరింది. అయోధ్య రామమందిరంలో బాలరాముడు కొలువు దీరాడు. ఈరోజు నుంచి భక్తులకు బాలరాముడు దర్శనమివ్వనున్నాడు. ఈక్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు వెళ్లడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. రామభక్తులకు భారతీయ రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఏపీలో విజయవాడ, గుంటూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, సామర్లకోట, అన్నవరం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం నుంచి అయోధ్యకు దక్షిణ మధ్య రైళ్లు వెళ్లనున్నాయి.
తెలంగాణ నుంచి సికింద్రాబాద్, కాజీపేట, జనగామ, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బల్హర్షా ప్రాంతాల మీదుగా రైళ్లు పోనున్నాయి. సికింద్రాబాద్ నుంచి ఈ నెల 29, 31, ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25 తేదీల్లో రైళ్లు నడవనున్నాయి. ఆయా రోజుల్లో రైలు సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరి వెళ్తుంది. అయోధ్య నుంచి ఈ నెల 30, ఫిబ్రవరి 1, 3, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 తేదీల్లో రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఆయా రోజుల్లో సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
ఏపీలో గుంటూరు నుంచి ఈ నెల 31న, విజయవాడ నుంచి ఫిబ్రవరి 4న, రాజమండ్రి నుంచి ఫిబ్రవరి 7న, సామర్లకోట నుంచి ఫిబ్రవరి 11న ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అయోధ్యకు వెళ్లాలనుకునే ప్రయాణికులు రైళ్ల సేవలను వినియోగించుకోవాలని కోరింది.