»Bus Going To Tirupati Overturned At Wanaparthy District 15 People Injured
TSRTC Bus Accident: తిరుపతి వెళ్తున్న బస్సు బోల్తా..15 మందికి గాయాలు
తిరుపతి వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు(TSRTC Bus) 44వ జాతీయ రాహదారి పరిధిలో పల్టీ కొట్టింది. ఘటనలో సుమారు 15 మందికి గాయాలు కాగా, ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది.
తిర్థయాత్ర కోసం పలువురు ప్రయాణికులు కలిసి తిరుపతి వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు(TSRTC Bus) 44వ జాతీయ రాహదారి పక్కన బోల్తా(overturned) పడింది. ప్రమాదంలో దాదాపు 15 మందికి గాయాలు కాగా, ఘటన సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన బస్సు యాదగిరిగుట్ట డిపోకు చెందిన బస్సుగా పోలీసులు(police) గుర్తించారు. శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వనపర్తి(wanaparthy district) కొత్తకోట పరిధిలోకి వచ్చిరాగనే బస్సు అదుపుతప్పి పల్టీ కొట్టినట్లు తెలుస్తోంది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు(police) ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ప్రమాదంలో గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బస్సులో ఇంకొంత మంది ప్రయాణికులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంది.
ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది? అతి వేగం కారణంగా బస్సు పల్టీ కొట్టిందా? లేదా డ్రైవర్ మద్యం ఏమైనా సేవించాడా? లేదా డ్రైవర్(driver) నిద్ర మత్తులో డ్రైవింగ్ చేస్తున్నాడా అనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.