PM Modi: Prime Minister announced exgratia to those who died in road accident!
PM Modi: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాల ట్యాంకర్‌ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 18 మంది చనిపోయారు. చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మరణించిన కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనలో గాయపడిన వాళ్లకి రూ.50 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రమాదం లక్నో-ఆగ్ర ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగింది.
ఇది కూడా చూడండి: Reduce Waist Size : పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు తగ్గాలంటే.. ఇలా చేయండి!

