KMM: మధిర మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులకు 178 నామినేషన్లు దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. మొదటి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదన్నారు. రెండో రోజు 29 నామినేషన్లు స్వీకరించామని పేర్కొన్నారు. మూడో రోజు 149 నామినేషన్లు వచ్చినట్లు చెప్పారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా నామినేషన్ల ప్రక్రియ పూర్తయిందని ఆయన అన్నారు.

