RR: ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా షాద్నగర్ పట్టణ సీఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, నగదు, నగలు తీసుకెళ్తే విధిగా రసీదులు చూయించాలన్నారు. లేదంటే వాటిని సీజ్ చేసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.