SKLM: పొందూరు మండలం కనిమెట్టలో శనివారం ఎన్టీఆర్ సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. పంచాయతీ కార్యదర్శి నర్సు నాయుడు ఆధ్వర్యంలో అర్హుల ఇళ్లకు వెళ్లి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పేద ప్రజలకు కల్పిస్తున్న పథకాలను వినియోగించుకోవాలని అన్నారు. అలాగే అర్హత ఉన్న వారికి నూతన పింఛన్లు కూటమి ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు.