NRPT: పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన మన్యంకొండ శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి జాతర ఉత్సవాల సందర్భంగా, నారాయణపేట నుంచి ప్రత్యేక బస్ సౌకర్యం కల్పించినట్లు డిపో మేనేజర్ లావణ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం, సోమవారం రెండు రోజుల పాటు బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్ సర్వీసులు నడుస్తాయని ఆమె పేర్కొన్నారు.

