ADB: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఆదిలాబాద్ MP గోడం నగేశ్ అన్నారు. బోథ్‌లోని TGSWG పాఠశాల, కళాశాలలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి బాలికల ఆటల పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక వ్యాయామం సైతం కలుగుతుందని పేర్కొన్నారు.

