TG: GHMC రూ. 11,460 కోట్లతో రూపొందించిన బడ్జెట్ పై ఇవాళ ప్రత్యేక పాలకమండలి సమావేశంలో చర్చించనున్నారు. అభివృద్ధి పనులకు జరిపిన కేటాయింపులు, ఆదాయ వ్యయాలపై నగర కార్పొరేటర్లు చర్చిస్తారు. ఈ పద్దుపై జరిగే చర్చలో పాత GHMC కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యుల హోదాలో పలువురు MLAలు, MLCలు పాల్గొననున్నారు. ప్రస్తుత పాలక మండలికి ఇదే చివరి సమావేశం.

