KNR: కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల పర్వం హోరాహోరీగా ముగిసింది. చివరి రోజైన శుక్రవారం రికార్డు స్థాయిలో 842 నామినేషన్లు దాఖలయ్యాయి. అంతకుముందు రోజు (29న) కేవలం 415 పత్రాలే రాగా, చివరి రోజు అభ్యర్థులు పోటెత్తారు. మొత్తంగా 66 వార్డులకు గాను 736 మంది అభ్యర్థులు 1,257 సెట్ల నామినేషన్లు సమర్పించారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లో త్రిముఖ పోరు ఉంది.

