E.G: జిల్లా పోలీసు శాఖ నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ క్యాంపిటేషన్కు అనూహ్య స్పందన లభించిందని ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. సైబర్ క్రైమ్, యాంటీ డ్రగ్, ఉమెన్ & చిల్డ్రన్, రోడ్ సేఫ్టీ అనే 4 విభాగాల్లో నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ పోటీలకు 93 వీడియోలు రావడం విశేషమన్నారు. మొత్తం 27 సెలెక్ట్ అవ్వగా ఫైనల్కు నాలుగు విభాగాల్లో 12 షార్ట్ ఫిలిమ్స్లకు బహుమతులు అందజేశారు.

