high power demand:తెలంగాణలో ఈరోజు అధిక విద్యుత్ డిమాండ్
high power demand in the telangana:తెలంగాణ (telangana) రాష్ట్ర చరిత్రలో ఈరోజు అత్యధిక విద్యుత్ (power) డిమాండ్ ఏర్పడింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు 14,549 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే అత్యధిక విద్యుత్ డిమాండ్. భవిష్యత్లో 15 వేల మెగావాట్ల (15 thousand power) విద్యుత్ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది.
high power demand in the telangana:చలికాలం ఇంకా పూర్తవనే లేదు.. ఎండలు మండిపోతున్నాయి. ఉదయం, రాత్రి చలి ఉంటుంది. మధ్యాహ్నం పూట ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో జనం (people) అల్లాడిపోతున్నారు. తెలంగాణ (telangana) రాష్ట్ర చరిత్రలో ఈరోజు అత్యధిక విద్యుత్ (power) డిమాండ్ ఏర్పడింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు 14,549 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే అత్యధిక విద్యుత్ డిమాండ్. భవిష్యత్లో 15 వేల మెగావాట్ల (15 thousand power) విద్యుత్ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక వేసవిలో ఎలా ఉంటుందో అనే సందేహాం కలుగుతుంది.
గతేడాదితో పోల్చితే విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరిగింది. ఈ రోజు అత్యధిక విద్యుత్ వినియోగించారు. శనివారం ఉదయం 10 గంటల వరకు 14 వేల 350 మెగావాట్ల విద్యుత్ వినియోగించారు. శుక్రవారం (ఫిబ్రవరి 10, 2023) సాయంత్రం 4 గంటలకు వరకు 14 వేల 169 యూనిట్లుగా నమోదు అయింది. గతేడాది ఇదే రోజున 11 వేల 420 మెగావాట్ల విద్యుత్ వాడారు. ఈ ఏడాది మే నెల వరకు రోజువారి విద్యుత్ వినియోగం 15 వేల మెగావాట్లకు చేరే అవకాశం ఉందని అంచనాలు నెలకొన్నాయి. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది.
సాగు విస్తీర్ణం పెరుగడంతోపాటు పారిశ్రామిక అసవరాలు పెరిగిన నేపథ్యంలో ఈ రోజు 14 వేల 500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. శుక్రవారం ఇదే సమయానికి 14 వేల 169 మెగావాట్ల విద్యుత్ (power) డిమాండ్ ఏర్పడగా శనివారం ఆ రికార్డ్ బ్రేక్ అయ్యింది. మధ్యాహ్నం తర్వాత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. గతేడాది మార్చి నెలలో 14 వేల 160 మెగావాట్ల అత్యధిక విద్యుత్ వినియోగం కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే గతేడాది రికార్డును అధిగమించింది.
ఈ సారి వేసవిలో 15 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ అవసరం ఉంటుందని విద్యుత్ అధికారులు అంచనా వేస్తున్నారు. వేసవిలో సాగు విస్తీర్ణంతోపాటు గృహ అవసరాలకు విద్యుత్ వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉంది. విద్యుత్ సరఫరాకు (power supply) అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు తెలంగాణ డిస్కంలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. తెలంగాణ రాష్ట్రం (telangana state) ఏర్పడిన కొత్తలో విద్యుత్ కొరత (power supply) ఏర్పడింది. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. ఈసారి ఫిబ్రవరిలో అధిక డిమాండ్ ఏర్పడటంతో.. ఏప్రిల్ (april), మే (may) నెలనాటికి మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉంది.