ADB: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదివాసీ విభాగం రాష్ట్ర వైస్ ఛైర్మన్గా సెడ్మకి ఆనంద్ రావ్ను AICC ప్రధాన కార్యదర్శి కే.సీ వేణుగోపాల్ నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన నాయకులకు ఆనంద్ రావ్ కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనవంతుగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.