KRNL: పెద్దకడబూరులో ఆదివారం రాత్రి కులపేరుతో దూషిస్తూ యువకుడిపై దాడి జరిగింది. గ్రామానికి చెందిన మాల దాసరి గురుస్వామి చర్చి దగ్గర కూర్చుని ఉండగా ప్రవీణ్, బందె నవాజ్, నరసింహ అనే ముగ్గురు వ్యక్తులు దాడి చేసి కులపేరుతో దూషించినట్లు ఫిర్యాదు చేశారు. గతంలో జరిగిన చిన్న వివాదమే దాడికి కారణమని పేర్కొన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నిరంజన్ ఇవాళ తెలిపారు