ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి వేకువజామున విశేష పూజలు చేశారు. ఈ వైకంఠ ద్వార దర్శనానికి భక్తాదులు పెద్ద సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండ ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు ఆలయ ఈఓ విజయరాజు తెలిపారు.