MBNR: పాలమూరు పట్టణంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు కన్నుల పండువగా సాగుతున్నాయి. కాటన్ మిల్లు ఆవరణలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు వేకువజాము నుంచే బారులు తీరారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, ప్రసాద వితరణ చేపట్టారు.