ప్రకాశం: ఒంగోలులోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో మంగళవారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రమాదేవి తెలిపారు. ఈ మేళాలో పలు కంపెనీలు టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత గల అభ్యర్థుల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయనీ చెప్పారు.18-35 ఏళ్ల నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.