NGKL: అమ్రాబాద్ మండలంలోని మాచారం గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. నేడు ఉదయం 7 గంటలకు స్వామికి ప్రత్యేక పూజల అనంతరం ఉత్తర ద్వార దర్శనాలు కల్పిస్తారు. అనంతరం పలు పూజ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.