KMR: నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి శివారులో మంజీరా నది నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం రాత్రి నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.