E.G: రాజమండ్రిలోని గోరక్షణపేట సబ్స్టేషన్ పరిధిలో ఆర్డీఎస్ఎస్ పనుల కారణంగా మంగళవారం విద్యుత్ కోత విధిస్తున్నట్లు ఈఈ ఎన్.శామ్యూల్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గాంధీపురం-2, గానుగవీధి, గోరక్షణపేట, దానవాయిపేట, గాంధీపార్క్, కిఫీ హాస్పిటల్, టీటీడీ రోడ్ తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.