ELR: న్యూ ఇయర్ విషెస్, ఫెస్టివల్ ఆఫర్స్ అంటూ వచ్చే వాట్సాప్ లింక్‌ని ఓపెన్ చేసి సైబర్ నేరగాళ్ల బారిన పడవద్దని పోలవరం ఎస్సై పవన్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఎస్సై మాట్లాడుతూ.. వాట్సాప్‌లో వచ్చే ఈ లింకులను ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాకింగ్‌కి గురై మీ డేటా చోరీ అవుతుందన్నారు. ప్రజలు సైబర్, ఆన్లైన్ మోసాలు బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.