ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని వీధి వ్యాపారుల ప్రాంగణం నూతన హంగులతో ముస్తాబవుతోంది.వ్యాపారులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించే లక్ష్యంతో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వర్షపు నీరు నిలవకుండా ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థతో పాటు, నడక మార్గాల ఆధునీకరణ, ఆకర్షణీయమైన టైల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు.