WGL: నెక్కొండ (M) కేంద్రంలోని సూరిపల్లి గ్రామంలో యూరియా బస్తాల విక్రయించేందుకు ఉదయం 5 గంటల నుంచి క్యూ లైన్లో వేచి ఉన్నట్లు రైతులు ఆరోపించారు. చలి వేధిస్తున్నప్పటికీ పంటకు సరిపడా యూరియా విక్రయించాలని చలిని సైతం లెక్కచేయకుండా యూరియా కోసం వచ్చినట్లు రైతులు పేర్కొన్నారు. అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించాలని కోరారు.