ELR: ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఉత్తర ద్వార దర్శనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం ముక్కోటి పర్వదినాన భక్తులు ఆలయ ఉత్తర ద్వారం నుంచి వెండి గరుడ వాహనంపై కొలువైన శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇందుకోసం శ్రీవారి ఆలయం ముస్తాబైంది. రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు.