SRD: జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరగడంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మంగళవారం ఉదయం జిన్నారం మున్సిపాలిటీలో కనిష్ట ఉష్ణోగ్రత 11.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, గాలిలో తేమశాతం 91.3%గా ఉంది. తెల్లవారుజామున పొగమంచు కమ్ముకోవడంతో దృశ్యమానత తగ్గింది. దీంతో వాహనదారులు హెడ్లైట్లు వేసుకొని నెమ్మదిగా వాహనాలను నడిపారు.