ADB: బోథ్ నియోజకవర్గంలో మైనారిటీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ తెలియజేశారు. బోథ్ మండల కేంద్రానికి చెందిన మైనారిటీలు సోమవారం రాత్రి గజేందర్‌ను కలిసి సమస్యలను విన్నవించారు. మైనారిటీల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.