VSP: జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం ఉదయం 10:30 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో ఛైర్పర్సన్ అధ్యక్షతన జరగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జెడ్పీ సీఈఓ పి. నారాయణమూర్తి తెలిపారు. జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు పూర్తి నివేదికలతో రావాలని ఆదేశించారు.