SKLM: పలాస నియోజకవర్గంలో వంశధార కాలువ ద్వారా శివారు ప్రాంతాలకు సాగునీరు అందించినందుకు మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్లకు సాగునీటి సంఘాల అధ్యక్షులు నిరంజన్ సోమవారం కృతజ్ఞతలు తెలిపారు. వంశధార కాలువ ద్వారా గతంలో శివారు ప్రాంతాలకు సాగునీరు అందక పంటలు పండేవి కాదని, మంత్రి చొరవతో శివారు ప్రాంతాలకు సాగునీరు అందిందన్నారు.