VSP: పెందుర్తిలో ఉన్న ఆదర్శ డిగ్రీ కళాశాలలో ఇవాళ ఉదయం 9 గంటల నుండి మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు కళాశాల కార్యదర్శి థియోఫిలస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేళాలో పలు సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.