రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న వీరి వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో అత్యంత ఘనంగా జరగనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులను మాత్రమే ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరికొన్ని రోజుల్లోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.